![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -327 లో..కావ్య, కళ్యాణ్ ఇద్దరు కలిసి రాజ్ చేస్తున్న పని గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే రాజ్ వ్యాయామం చెయ్యడానికి వాళ్ళ ముందుకు వచ్చి కావాలనే అటిట్యూడ్ గా ప్రవర్తిస్తుంటాడు. అప్పుడే ఇందిరాదేవీ, ప్రకాష్, సుభాష్ లు వచ్చి.. ఏంటి ఎన్నడు లేనిదీ ఫిట్ నెస్ పై దృష్టిపెట్టావని అడుగుతారు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఫిట్ నెస్ పెంచు అంది. అందుకే అని రాజ్ అంటాడు. పెళ్లి అయ్యాక ఇలా చేసావ్.. మళ్ళీ ఇప్పుడు అని ఇందిరాదేవి అనగానే.. నేను ఎప్పుడు నిత్య పెళ్ళికొడుకునే అని రాజ్ అంటాడు. ఆ మాటలు అన్ని కావ్య, కళ్యాణ్ ఇద్దరు వింటుంటారు.
ఆ తర్వాత గీజర్ పాడైందని కావ్య బకెట్ లో రాజ్ కి వేడి వాటర్ తీసుకొని వెళ్తుంది. అవి బాత్రూం లో పెట్టి వస్తుంటే రాజ్ కావాలనే నా ఫిట్ నెస్ చూసావా అంటూ బిల్డప్ ఇస్తుంటాడు. అప్పుడే రాజ్ కి శ్వేత కాల్ చేస్తుంది. ఆ ఫోన్ కావ్య తీసుకొని చూస్తుంది. వెంటనే రాజ్ లాక్కొని మాట్లాడుతాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత మండుతున్నట్లు ఉందని అనుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్తాడు. బకెట్ లో వేడి వాటర్ ఉన్నాయని అని కావ్యని చెప్పనివ్వకుండా లోపలికి వెళ్తాడు. బాత్రుమ్ నుండీ కెవ్వుమంటు రాజ్ అరుపులు. కావ్య వెళ్లేసరికి.. చెప్పాలి కదా అని రాజ్ అంటాడు. మీరు చెప్పనిచ్చారా అంటూ కాసేపు ఇద్దరు ఆర్గుమెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తుంటారు. రాజ్ ఎక్కడ అనేలోపు వేడి వాటర్ పోయడం వాళ్ళ ఒక కన్ను తెరవలేకపోతు చిన్న ఫ్యాన్ పట్టుకొని వస్తుంటాడు. ఏమైందని అందరు అడుగుతారు. వేడి వేడి టిఫిన్ చెయ్ అని అపర్ణ అనగానే అమ్మో వేడి అంటు బయపడుతాడు.
ఆ తరువాత రాజ్ బ్రేక్ ఫాస్ట్ గా పచ్చి కూరగాయ ముక్కలు తింటు ఉంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఎవరెవరికి ఏం కావాలో తెప్పించావా అని అపర్ణని ఇందిరాదేవి అడుగుతుంది. ఇంకా ఎవరు లిస్ట్ ఇవ్వలేదని అపర్ణ చెప్తుంది. గతంలో ధాన్యలక్ష్మి ఎక్కువ లిస్ట్ రాసినందుకు కాస్త తగ్గించు అని అపర్ణ అన్న విషయం ధాన్యలక్ష్మి గుర్తుకు చేసుకొని.. ఈసారి ఆవిడని అసలు అడగొద్దని ధాన్యలక్ష్మి అనుకుంటుంది. ఆ తరువాత నాకు కొంత డబ్బు కావాలి. ప్రతీదానికి తనని అడగలేనని ప్రకాష్ తో ధాన్యలక్ష్మి చెప్తుంది. ఇప్పుడేంటి ఎప్పుడు వదినను అడుగుతావ్ కదా.. ఇప్పుడు వెళ్లి అడుగు అని ప్రకాష్ అంటాడు. నేను అడుగనని ధాన్యలక్ష్మి అంటుంది. వాళ్ళ మాటలు అపర్ణ వింటుంది. నన్ను అడగడం ఇష్టం లేదా.. నా విలువ నా పెద్దరికం తెలిసేలా చేస్తానని అపర్ణ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |